India: భారత్ లో చొరబడడానికి డ్రోన్లతో సెర్చ్!

  • అప్రమత్తమైన భారత సైన్యం
  • ఫిరోజ్ పూర్, హుస్సేన్ వాలా సెక్టార్లలో భారీగా బీఎస్ఎఫ్ జవాన్ల మోహరింపు
  • ఇప్పటికే మూడు డ్రోన్లను కూల్చిన జవాన్లు

భారత్ లోకి చొరబడటానికి ఉగ్రవాదులు కొత్త దారులు వెతుకుతున్నారు. సరిహద్దు దాటేందుకు అనువుగా ఉన్న ప్రదేశాలను గుర్తించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. కెమెరాలతో కూడిన డ్రోన్లను ఇటీవల పంజాబ్ లోని ఫిరోజ్ పూర్, హుస్సేన్ వాలా సెక్టార్లలో భద్రతా బలగాలు గుర్తించాయి.

ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో భారీగా భద్రతా దళాలను మోహరించారు. సోమవారం కూడా ఒక డ్రోన్ ను గుర్తించామని సైనికాధికారులు తెలిపారు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ, ఉగ్రవాదులను భారత్ లోకి పంపేందుకు ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాద సంస్థలు లష్కరే తొయిబా, జైషే మహ్మద్ కూడా వీరికి సహాయం చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. సరిహద్దు భద్రతా బలగాలు ఇప్పటివరకు మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు అధికారులు ప్రకటించారు.

More Telugu News