Andhra Pradesh: కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తున్నారు: ఏపీ టీడీపీ నేత ఆలపాటి

  • ఈ నెల 25న నిరాహార దీక్షలకు పిలుపు
  • కొత్త ఇసుక విధానంతో వైసీపీ, ఇసుక మాఫియాకు లబ్ధి
  • ఇసుక కొరత ఏర్పడితే..అక్రమ రవాణా ఎలా జరుగుతుంది?

ఆంధ్రప్రదేశ్ లో కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించారంటూ ప్రభుత్వం తీరుపై టీడీపీ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇసుక కొరతతో 30 లక్షల మందికిపైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరంతా ఆందోళనలో పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు. ఇటీవల తీసుకువచ్చిన కొత్త ఇసుక విధానంతో వైసీపీ నేతలు, ఇసుక మాఫియా లాభపడ్డారని ఆరోపించారు. వరదల వల్ల ఇసుక కొట్టుకుపోలేదని, కావాలనే ఇసుక కొరత సృష్టించారని అన్నారు. ఇసుక కొరత ఏర్పడితే... అక్రమ రవాణా ఎలా జరుగుతోందని ప్రశ్నించారు.

More Telugu News