మళ్లీ జారిపడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్

22-10-2019 Tue 20:17
  • తుంటి ఎముకకు గాయం
  • పెద్ద ప్రమాదం లేదు
  • త్వరలోనే డిశ్చార్జి చేస్తామన్న వైద్యులు

జీవించి వున్న అమెరికా మాజీ అధ్యక్షుల్లో కురువృద్ధుడైన జిమ్మీకార్టర్ (95 ఏళ్లు) తన నివాసంలో మళ్లీ జారి పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు జిమ్మీని ఆస్పత్రికి  తరలించారు. తుంటి ఎముకలో సన్నని చీలిక వచ్చిందని వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. డిశ్చార్జీకి కొంత సమయం పడుతుందని, ఫొయెబె మెడికల్ సెంటర్ డైరెక్టర్ డయాన కాంగిలియో తెలిపారు. జిమ్మీ కార్టర్ కిందపడటం ఇది రెండోసారి. 15 రోజుల క్రితం ఆయన ప్రార్థనల కోసం చర్చికి బయలుదేరే ముందు ఇంట్లో కిందపడ్డారు. తలకు గాయం కాగా 14 కుట్లు పడ్డాయి. గతంలో బ్రెయిన్ ట్యూమర్, కాలేయ క్యాన్సర్ కు గురైనప్పటికి వాటి నుంచి విజయవంతంగా బయటపడ్డారు.