Ponguleti: ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: బీజేపీ నేత పొంగులేటి

  • నాలుగు నెలల చిన్నారి మృతిపై ఆగ్రహం 
  • ఆరోగ్యశాఖ అధికారులు లంచగొండులుగా మారారు
  • ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు పాటించటం లేదు

తెలంగాణలో ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో విఫలమవుతోందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్, ఎల్బీనగర్ లోని షైన్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఇది ఆరోగ్య శాఖ నిర్లక్ష్యానికి సాక్ష్యమని అన్నారు. ఆరోగ్యశాఖకు జబ్బు చేసిందని విమర్శించారు. ఈ ఘటనలో నాలుగు నెలల చిన్నారి మృతి చెందడం తన హృదయాన్ని కలచివేసిందన్నారు.

ఆస్పత్రి యాజమాన్యం నిబంధనలను తుంగలో తొక్కడం వల్లే అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని పొంగులేటి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రులు డెంగ్యూ జ్వరాల పేరుతో ప్రజలను  దోచుకుంటున్నాయన్నారు. అరోగ్యశాఖ అధికారులు లంచగొండులుగా మారారని మండి పడ్డారు. డెంగ్యూ జ్వరాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణలో విఫలమయిందన్నారు.

More Telugu News