Chandrababu: రివర్స్ టెండర్లు కాదు, రిజర్వ్ డ్ టెండర్లు: చంద్రబాబు విమర్శలు

  • శ్రీకాకుళంలో మీడియా సమావేశం
  • గొప్పలు చెప్పుకుంటున్నారన్న చంద్రబాబు
  • బిల్లులు ఎవరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ సర్కారు తీరుపై మండిపడ్డారు. "వీళ్లకు నచ్చిన కాంట్రాక్టర్లకే డబ్బులు ఇస్తున్నారు. 2000 కోట్లు ఇచ్చినట్టు తెలిసింది. ఎవరికి ఇచ్చారో, ఎంతిచ్చారో చెప్పాలి. వీళ్లకు నచ్చిన మేఘా సంస్థకో, గాయత్రీ సంస్థకో, ఓ మంత్రికో ఇచ్చుంటారు. టెండర్లలోనూ అంతే. అవి రివర్స్ టెండర్లు కాదు, రిజర్వ్ డ్ టెండర్లు. ఆ మాత్రానికే పెద్ద పారదర్శక ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. రూ.7500 కోట్లు నష్టం వస్తుంటే రూ.750 కోట్లు ఆదా చేశామంటున్నారు. పోలవరం అథారిటీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ప్రాజెక్టు లిటిగేషన్ లో పడితే ఎప్పటికి పూర్తవుతుంది అని అథారిటీ  ఆందోళన వ్యక్తం చేసింది.  

రాజధాని విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఇవాళ్టికి సరిగ్గా నాలుగేళ్ల క్రితం ప్రధానిని పిలిచి రాజధానికి శంకుస్థాపన చేయించాం. ప్రపంచమంతా నాడు అమరావతి పేరు మార్మోగింది. అమరావతి అనే కొత్త నగరం వస్తోందని ప్రపంచమంతా చర్చించుకున్నారు. అమరావతి కోసం అనుసరించిన లాండ్ పూలింగ్ ప్రక్రియను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కేస్ స్టడీగా పరిగణించారు. ఓ నగరం కోసం ఇన్నివేల ఎకరాలు ఇస్తారా అని చర్చించుకున్నారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టనవసరంలేదు. అలాంటి బంగారు గుడ్లు పెట్టే బాతును చంపేస్తారా?" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News