ap7am logo

కారు నంబర్ ప్లేట్ పై ‘ఏపీ సీఎం జగన్’ అని రాసుకున్న యువకుడు!

Tue, Oct 22, 2019, 06:37 PM
  • తూ.గో. జిల్లాకు చెందిన యువకుడు రాకేశ్  
  • జీడిమెట్లలో నివాసం..తన కారు నంబర్ ప్లేట్ పై జగన్ పేరు 
  • ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు
కార్లు, బైక్ ల నంబరు ప్లేట్లపై కొందరు తమకు నచ్చిన క్యాప్షన్స్ ను రాయించడమో, లేక అభిమాన నటులు, రాజకీయ నాయకుల చిత్రాలు అతికించడమో మనం చూస్తూ ఉంటాం. తాజాగా, ఇలాంటి ఘటనొకటి మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను  ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 19న జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులో తన ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు నంబరు ప్ ప్లేట్ చూసిన ట్రాఫిక్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, నంబర్ కు బదులుగా ‘AP CM JAGAN’ అని నంబర్ ప్లేట్ పై రాసి ఉంది. వెంటనే, ఆ వాహనాన్ని ఆపి ఈ విషయమై ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పోలీసుల తనిఖీలు, టోల్ గేట్ ఫీజుల నుంచి తప్పించుకో వచ్చని భావించి ఈ ఉపాయం పన్నినట్టు కారు యజమాని ముప్పిడి హరి రాకేశ్ చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. దీంతో, ఆ కారును సీజ్ చేసి జీడిమెట్లపోలీస్ స్టేషన్ కు తరలించినట్టు చెప్పారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన యువకుడు రాకేశ్ జీడిమెట్లలో నివసిస్తున్నాడు.  
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Latest Video News..
Advertisement