మాచర్ల లో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు.. టీడీపీ నేతల ధర్నా

22-10-2019 Tue 15:02
  • మార్కెట్ యార్డు ఎదుట విగ్రహం తొలగింపు
  • విగ్రహాన్ని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్
  • డీఎస్పీ హామీ మేరకు ఆందోళన విరమణ

మాచర్ల మార్కెట్ యార్డు ఎదుట ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై వివాదం తలెత్తింది. విగ్రహం తొలగింపును నిరసిస్తూ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. తొలగించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు హామీ ఇచ్చారు. డీఎస్పీ హామీ మేరకు టీడీపీ నేతలు తమ ఆందోళన విరమించారు. ధర్నా కార్యక్రమంలో టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, డొక్కా మాణిక్యవరప్రసాద్, కుర్రి పున్నారెడ్డి, పిన్నెల్లి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.