బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక వితిక తొలి స్పందన!

22-10-2019 Tue 12:41
  • ఆదివారం నాడు వితిక ఎలిమినేషన్ 
  • నా జర్నీ ఎంతో అందంగా నడిచింది
  • మద్దతుగా నిలిచిన వారికి అభినందనలు
  • ఫేస్ బుక్ లో పోస్ట్

గత ఆదివారం నాడు టాలీవుడ్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నటుడు వరుణ్ సందేశ్ భార్య వితిక, తొలిసారిగా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ ఎంతో అందంగా సాగిందని, తానెంతో మంది స్నేహితులను తయారు చేసుకున్నానని, ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండి పోతాయని చెప్పింది. హౌస్ నుంచి బయటకు వచ్చినా, తన మనసు మాత్రం వరుణ్ తోనే ఉండిపోయిందని చెప్పుకుంది. తానిప్పుడు హౌస్ ను మిస్ అవుతున్నానని, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి అభిమానికి, హౌస్ లోని పోటీదారులందరికీ అభినందనలు తెలిపింది.