space: అతి తక్కువ ఖర్చుతో స్పష్టంగా అంతరిక్ష చిత్రాలు.. భారత సంతతి పరిశోధకురాలి అరుదైన ఘనత

  • ఇజ్రాయెల్‌లో పీహెచ్‌డీ చేస్తోన్న పరిశోధకురాలు  
  • వినూత్న టెలిస్కోపు వ్యవస్థ డిజైన్‌ 
  • నానో ఉపగ్రహాలతో రూపకల్పన

ఇజ్రాయెల్‌లో స్థిరపడి, అక్కడే పీహెచ్‌డీ చేస్తోన్న భారత సంతతి పరిశోధకురాలు అంగికా బుల్బుల్‌ అరుదైన ఘనతను సాధించారు. వినూత్న టెలిస్కోపు వ్యవస్థను డిజైన్‌ చేసి, అంతరిక్ష చిత్రాలను స్పష్టంగా తీసే కెమెరాను రూపొందించారు. పాల ప్యాకెట్ల పరిమాణంతో కూడిన బుల్లి నానో ఉపగ్రహాలతో దీన్ని సృష్టించారు. రోదసి నుంచి తక్కువ ఖర్చుతో చిత్రాలు తీయొచ్చు.

సాధారణంగా అంతరిక్షంలో ఉండే వాటి ఫొటోలను స్పష్టంగా తీయలేము. ఇందుకోసం చాలా ఖరీదైన కెమెరాలతో తీయడానికి ప్రయత్నించినా అవి అంత స్పష్టంగా రావు. అంతేగాక, టెలిస్కోపులకు సంబంధించిన ఆప్టికల్ వ్యవస్థల అపెర్చర్ తీరుతెన్నులపై చాలా పరిమితులు ఉంటాయి. రోదసీ నుంచి తీసే చిత్రాల రిజల్యూషన్ పై ప్రభావం పడుతోంది. అంగికా బుల్బుల్‌ రూపొందించిన ఈ కెమెరాతో వీటన్నింటినీ అధిగమించొచ్చు.

More Telugu News