'ఆర్ఆర్ఆర్' ఎన్టీఆర్ కొమరం భీమ్... ఫస్ట్ లుక్ ఇదే!

22-10-2019 Tue 10:25
  • కొమరం భీమ్ జయంతి సందర్భంగా పోస్టర్
  • రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం
  • ఎన్టీఆర్ షాడోను చూపుతూ ఫస్ట్ లుక్ విడుదల

తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్ జయంతి నేడు కాగా, రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్, ఓ లుక్ ను విడుదల చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. భీమ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. దీనిలో ఎన్టీఆర్ షాడో మాత్రమే కనిపిస్తోంది. చేతిలో తుపాకీని పట్టుకుని ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. త్వరలోనే యువ భీమ్ ను వెండితెరపై చూపించేందుకు తాము కూడా ఎదురు చూస్తున్నామని ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వ్యాఖ్యానించింది.