రాబర్ట్ వాద్రాకు అస్వస్థత... ఆసుపత్రిలో చేరిక!

22-10-2019 Tue 09:59
  • వెన్నునొప్పితో బాధపడుతున్న వాద్రా
  • నోయిడాలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
  • రాత్రంతా భర్తకు తోడుగా ఉన్న ప్రియాంక

కాంగ్రెస్ మహిళా నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు నోయిడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. తనకు వెన్నునొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు వాద్రా చెప్పడంతో, వారు ఆసుపత్రికి తరలించగా, ఆర్ధోపెడిక్ వైద్య విభాగంలో చికిత్స జరుగుతోంది.

భర్తతో పాటు ఆసుపత్రికి వచ్చిన ప్రియాంకా గాంధీ, రాత్రంతా ఆయనతోనే ఆసుపత్రిలో ఉన్నారు. ఆసుపత్రి బెడ్ పై ఉన్న వాద్రా చిత్రాలు కొన్ని బయటకు రాగా, కాలికి బ్యాండేజ్ తో ఆయన కనిపిస్తున్నారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు.