హుజూర్ నగర్ లో గెలవబోతున్నాం: టీఆర్ఎస్ నేత కేటీఆర్

21-10-2019 Mon 19:21
  • మా నాయకుల నుంచి ఫీడ్ బ్యాక్ అందింది
  • టీఆర్ఎస్ అభ్యర్థి గౌరవప్రదమైన మెజార్టీ సాధిస్తారు
  • టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా కృతఙ్ఞతలు
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆ పార్టీ నేత కేటీఆర్ మరోమారు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. తమ నాయకుల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ మేరకు హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గౌరవప్రదమైన మెజార్టీతో గెలవబోతున్నారని నమ్ముతున్నానని అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల నిమిత్తం గత నెల రోజులుగా ఎంతగానో శ్రమించిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.