Mallu ravi: రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన సాగడం లేదు: టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

  • కేసీఆర్ సర్కార్ పై ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమయింది
  • హుజూర్ నగర్ ఉప ఎన్నిక  ఫలితాలతో ఇది బహిర్గతమవుతుంది
  • నియంతృత్వ ధోరణివల్లే కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు

తెలంగాణలో రాజ్యాంగబద్ధ పాలన జరగటం లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ప్రజల, కార్మికుల హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తోందని.. ఆయన నియంతృత్వ ధోరణి వల్లే తమ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిందన్నారు.

గాంధీ భవన్ లో రవి మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ చేస్తున్నది ప్రజాస్వామ్య పాలన కాదు.  ఇలాంటి అణచివేత ఇప్పటివరకు చూడలేదు,  హైకోర్టు ఆదేశాలను సైతం కేసీఆర్ పట్టించుకోవడంలేదు, చర్చలు లేవని చెప్పడం ఆయన నియంతృత్వ ధోరణికి నిదర్శనం’ అని చెప్పారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజలు తిరగబడే సమయం వచ్చిందన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితంతో ఆ ప్రభావం తెలుస్తుందన్నారు.

More Telugu News