India today: ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీదే హవా!

  • టైమ్స్ నౌ, ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి
  • బీజేపీ కూటమికి 230 స్థానాలు: టైమ్స్ నౌ
  • బీజేపీకి 109 నుంచి 124 స్థానాలు: ఇండియా టుడే

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొంచెం సేపటి క్రితం ముగిసిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుపు సాధిస్తుందన్న విషయమై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాగా ఉంది. ఈ అంచనాలు నిజమైతే కనుక మరోసారి రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకోనుంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోరంగా భంగపడనుంది.

టైమ్స్ నౌ (మహారాష్ట్ర)..  బీజేపీ కూటమికి 230 స్థానాలు, కాంగ్రెస్ కూటమికి 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు

టైమ్స్ నౌ (హర్యానా).. బీజేపీకి 71 స్థానాలు, కాంగ్రెస్ కు 11 స్థానాలు

ఇండియా టుడే (మహారాష్ట్ర) .. బీజేపీకి 109 నుంచి 124 స్థానాలు, శివసేనకు 57 నుంచి 70, కాంగ్రెస్ కు 32 నుంచి 40, ఎన్సీపీ 40 నుంచి 50, ఇతరులకు 22 నుంచి 30 స్థానాలు  

రిపబ్లిక్ (మహారాష్ట్ర).. బీజేపీకి 135 నుంచి 142 స్థానాలు, శివసేనకు 81నుంచి 88 స్థానాలు, కాంగ్రెస్ కు 20 నుంచి 24 స్థానాలు, ఎన్సీపీకి 30 నుంచి 35 స్థానాలు, ఇతరులకు 8 నుంచి 12 స్థానాలు

రిపబ్లిక్ (హర్యానా).. బీజేపీకి  52 నుంచి 63 స్థానాలు, కాంగ్రెస్ కు 15 నుంచి 19 స్థానాలు, జేజేపీ కి 5 నుంచి 9 స్థానాలు, ఐఎన్ఎల్ డీ 0 నుంచి 1 స్థానం, ఇతరులకు 7 నుంచి 9 స్థానాలు

న్యూస్ ఎక్స్ (హర్యానా).. 
బీజేపీకి 75 నుంచి 80 స్థానాలు, కాంగ్రెస్ 9 నుంచి 12 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 3 స్థానాలు

సీఎన్ఎన్ న్యూస్ 18 (మహారాష్ట్ర).. 
బీజేపీ కూటమికి 243 స్థానాలు, కాంగ్రెస్ కు 41 స్థానాలు, ఇతరులకు 4 స్థానాలు

ఏబీపీ న్యూస్ సి.ఓటర్ (మహారాష్ట్ర).. 
బీజేపీ కూటమికి 204 స్థానాలు, కాంగ్రెస్ కు 69 స్థానాలు, ఇతరులకు 15 స్థానాలు

న్యూస్ 24 (మహారాష్ట్ర).. బీజేపీ కూటమికి 230 స్థానాలు, కాంగ్రెస్ కు 48 స్థానాలు, ఇతరులకు 10 స్థానాలు

More Telugu News