Hyderabad: పోలవరం పనులు ఆలస్యం చేయద్దు: పీపీఏ సూచన

  • రీటెండరింగ్ తర్వాత పనుల తీరుపై చర్చించాం
  • పనులు ఆలస్యమైతే ప్రయోజనాలు అందడంలోనూ ఆలస్యమే
  • వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని సూచించాం: బీపీ పాండే

హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశం ముగిసింది. పీపీఏ సీఈఓ ఆర్కే జైన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనంతరం, మీడియాతో పీపీఏ సభ్య కార్యదర్శి బీపీ పాండే మాట్లాడుతూ, పోలవరం హెడ్ వర్క్స్ రీటెండరింగ్ తర్వాత పనుల తీరుపై చర్చించామని, పనులు ఆలస్యమైతే ప్రయోజనాలు ఆలస్యంగా అందుతాయని అన్నారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగితే ప్రయోజనాలు అందడంలోనూ ఆలస్యం అవుతుంది కనుక వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని సూచించినట్టు చెప్పారు.

 హైకోర్టు స్టే ఉన్నందున ప్రాజెక్టు పనులు అప్పగించలేమని ప్రభుత్వం చెప్పిందని, స్టే ఎత్తివేతకు ప్రయత్నిస్తున్నామని ఏపీ ప్రభుత్వ అధికారులు చెప్పారని అన్నారు. నిపుణుల కమిటీ పరిశీలనపై ఏపీ వివరణను కేంద్ర జలశక్తి శాఖకు నివేదించామని, ఇంకా పూర్తి స్థాయిలో సాంకేతిక పరిశీలనలు చేయాల్సి ఉందని అన్నారు.

More Telugu News