Lotus pond: లోటస్ పాండ్ కు వెళుతుంటే కోటి ఇరవై లక్షలు గాలిలో కలిసిపోతున్నాయి!: జగన్ పై మాణిక్యాలరావు విమర్శలు

  • టీడీపీ పాలనలో అవినీతి జరిగితే విచారణ చేయొచ్చుగా
  • ఈ ప్రభుత్వం తీరు దారుణంగా ఉంది
  • తునిలో జర్నలిస్ట్ హత్య ఘటనే ఇందుకు నిదర్శనం

ఏపీ సీఎం జగన్ పై బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీజీ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, టీడీపీ పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న సీఎం జగన్, దానిపై విచారణ చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై, వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకంగా వార్తలు రాసే వారిపై దాడులు చేస్తారా? వారిపై దౌర్జన్యం చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉందో చెప్పడానికి తునిలో జర్నలిస్ట్ హత్య ఘటనే నిదర్శనమని అన్నారు.

సీబీఐ న్యాయస్థానానికి ఒకసారి హాజరైతే తనకు అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక కోర్టుకు హాజరుకావడంపై తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ కోరడంపై ఆయన విమర్శలు చేశారు. ‘వారంలో రెండు సార్లు లోటస్ పాండ్ లో మీ ఇంటికి వెళుతుంటే మా డబ్బు కోటి ఇరవై లక్షల రూపాయలు గాలిలో కలిసిపోతోందన్న విషయాన్ని ఒక్కసారి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జ్ఞప్తికి తెస్తున్నా’ అని అన్నారు.

More Telugu News