ఓటమి అంచున సఫారీలు... సంబరాలు మొదలుపెట్టిన భారత అభిమానులు

21-10-2019 Mon 17:05
  • ఫాలో ఆన్ ఆడుతున్న సఫారీలు
  • రెండో ఇన్నింగ్స్ లో 121 రన్స్ కు 8 వికెట్లు డౌన్
  • విజృంభించిన భారత పేసర్లు

రాంచీ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఓటమి ముంగిట నిలిచింది. 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో ఫాలో ఆన్ ఆడుతున్న సఫారీలు మూడో రోజు ఆటలో చివరికి 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేశారు. టీమిండియా పేసర్ షమీ అద్భుత స్పెల్ తో దక్షిణాఫ్రికా టాపార్డర్ ను కుప్పకూల్చాడు. 2 వికెట్లు తీయడం ద్వారా ఉమేశ్ యాదవ్ కూడా సఫారీల పతనంలో పాలుపంచుకున్నాడు. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన టీమిండియా చివరిదైన మూడో టెస్టులోనూ విజయం దిశగా పయనిస్తోంది. భారత్ గెలుపునకు 2 వికెట్లు కావాలి. సౌతాఫ్రికా ఇంకా 214 పరుగులు వెనుకబడి ఉంది. కోహ్లీ సేన విజయంపై ఎవరికీ సందేహాలు లేకపోవడంతో అభిమానులు అప్పుడే సంబరాలు షురూ చేశారు.