Andhra Pradesh: ‘రివర్స్’తో ఇప్పటివరకూ రూ.1000 కోట్ల ఆదా చేశాం: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

  • రివర్స్ టెండరింగ్ విధానంలో సక్సెస్ అవుతున్నాం
  • పదిహేను వందల కోట్లు ఆదా చేయబోతున్నాం
  • ‘రివర్స్’పై ప్రతిపక్ష నాయకుల ఆరోపణలు తగదు

రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1000 కోట్లు ఆదా చేశామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తాడేపల్లిలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రివర్స్ టెండరింగ్ విధానంలో సక్సెస్ అవుతున్నామని చెప్పారు. తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పనులు రూ.540 కోట్లకు సంబంధించి రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని, దీంతో ప్రభుత్వానికి రూ.61 కోట్లకు పైగా ఆదా అయిందని చెప్పారు. ఇంకా నెల రోజుల్లో ఇరిగేషన్ శాఖ ద్వారా 1500 కోట్లు ఆదా చేయబోతున్నట్టు చెప్పారు.

ఈ విధానంతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేస్తే దాన్ని దోపిడీ అంటారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ విధానంపై ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని ఆదా చేస్తుంటే హర్షించాల్సిందిపోయి విమర్శలు చేయడం తగదు అని ప్రతిపక్ష నేతలకు హితవు పలికారు.

More Telugu News