నవ నిర్మాణ సేన నేత అమిత్ జానీకి బెదిరింపు లేఖ!

21-10-2019 Mon 15:06
  • మిమ్మల్ని చంపుతామంటూ బెదింపు
  • హిందూ సమాజ్ పార్టీ చీఫ్ కమలేష్ తివారీ హత్యతో యూపీలో కలకలం
  • సాధ్వీ ప్రాచీకు సైతం బెదిరింపులు

ఉత్తర ప్రదేశ్ లోని  నవ నిర్మాణ పార్టీ నేత అమిత్ జానీని హత్య చేస్తామంటూ ఆయనకు బెదిరింపు లేఖ రావడంతో  కలకలం చేలరేగింది. గుర్తు తెలియని ఓ మహిళ ఈ లేఖ వున్న సీల్డ్ కవర్ ను జానీ నివాసం వద్ద సెక్యూరిటీ గార్డుకు ఇచ్చి వెళ్లింది. ‘కమలేష్ తివారీ తర్వాత నోయిడాలో నువ్వే’ అని లేఖలో రాసివుందని జానీ తెలిపారు. ఈ మేరకు జానీ పోలీసులుకు ఫిర్యాదు చేస్తూ..ఆ లేఖను వారికి అందించారు. కవర్ పై ఎలాంటి అడ్రస్ రాయలేదని చెప్పారు.

నాలుగు రోజుల క్రితం హిందూ సమాజ్ పార్టీ అధినేత కమలేష్ తివారీ హత్య జరిగిన విషయం తెలిసిందే. మరో హిందూత్వ నేత సాధ్వీ ప్రాచీ సైతం తనకు బెదిరింపు లేఖలు వస్తున్నాయని తెలిపారు. తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోం మంత్రిని, ఉత్తరా ఖండ్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలను ఆమె కోరారు. మరోవైపు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని జానీకి సూచించారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, లేఖను అందించిన మహిళ ఎవరు? అన్న విషయాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని  తెలిపారు.