హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న రానా సోదరుడు అభిరామ్

21-10-2019 Mon 11:16
  • నటనలో శిక్షణ పొందుతున్న అభిరామ్ 
  • కొత్త కథలు వింటున్న సురేశ్ బాబు 
  • త్వరలో సొంత బ్యానర్ ద్వారా పరిచయం 

తెలుగు తెరపై కథానాయకుడిగా .. ప్రతినాయకుడిగా రానా తనదైన ముద్రవేశాడు. ఆ బాటలో తాను కూడా హీరో కావడానికి రానా సోదరుడు సిద్ధమవుతున్నాడు. రానా తమ్ముడైన అభిరామ్ ను హీరోగా పరిచయం చేయడానికి కొంతమంది దర్శక నిర్మాతలు ఇంతకుముందే ఉత్సాహాన్ని చూపారు. అయితే అందుకు సరైన సమయం రాలేదంటూ సురేశ్ బాబు వాయిదావేస్తూ వచ్చారు.

మరో వైపున ఆయన అభిరామ్ కి ముంబైలో నటనతో పాటు డాన్స్ .. ఫైట్స్ .. హార్స్ రైడింగ్ తదితర విషయాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారట. అభిరామ్ శిక్షణ పూర్తవుతూ ఉండటంతో, అతని కోసం సురేశ్ బాబు కథలు వింటున్నారని అంటున్నారు. మంచి కథ దొరికితే సొంత బ్యానర్లో సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. మొత్తానికి దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో రానున్నాడన్న మాట.