రాంచీ టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ హంజా అర్ధ సెంచరీ

21-10-2019 Mon 10:36
  • ఎల్గర్‌, డికాక్‌, డుప్లెసిస్ ఔట్
  • క్రీజులో హంజాతో పాటు బవుమా
  • ఉమేశ్ యాదవ్ కు రెండు వికెట్లు

రాంచీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా నిన్న 116.3 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 497 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ కొనసాగిస్తోన్న దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల ధాటికి ఎల్గర్‌ (2 బంతుల్లో 0) , డికాక్‌ (ఆరు బంతుల్లో 4),  డుప్లెసిస్ (9 బంతుల్లో 1) తక్కువ పరుగులకే వెనుదిరిగారు.

అయితే, క్రీజులో నిలదొక్కుకున్న హంజా 57 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అతడితో పాటు బవుమా (22 పరుగులు) క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ కి రెండు వికెట్లు, షమీకి ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 19 ఓవర్లకి 85/3 గా ఉంది.