చివరి షెడ్యూల్ కి వెళుతోన్న 'సరిలేరు నీకెవ్వరు'

21-10-2019 Mon 09:50
  • విభిన్నమైన కథాంశంతో 'సరిలేరు నీకెవ్వరు'
  • పవర్ఫుల్ పాత్రతో విజయశాంతి రీ ఎంట్రీ 
  • జనవరి 12వ తేదీన భారీస్థాయిలో విడుదల

మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి ఇంటికి సంబంధించిన సన్నివేశాలను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణతో పాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. చివరి షెడ్యూల్ చిత్రీకరణకి ఈ సినిమా టీమ్ సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ షెడ్యూల్ ను పూర్తిచేయనున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. చాలా కాలం తరువాత ఈ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆమె పవర్ఫుల్ రోల్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.