ap7am logo

అపరిశుభ్ర వాతావరణంలో జొమాటో బ్యాగులు.. లక్ష రూపాయల జరిమానా

Mon, Oct 21, 2019, 08:32 AM
  • చెన్నైలో పెరుగుతున్న డెంగీ కేసులు
  • నివారణ చర్యలు చేపట్టిన అధికారులు
  • అపరిశుభ్రంగా ఉన్న కార్యాలయాలు, సంస్థలకు జరిమానాలు
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు చెన్నై కార్పొరేషన్ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. చెన్నైలో ఇటీవల డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో స్పందించిన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అపరిశుభ్ర పరిసరాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. అపరిశుభ్రంగా కనిపించిన సంస్థలు, కార్యాలయాలకు కార్పొరేషన్ అధికారులు ఎక్కడికక్కడ జరిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని చేట్‌పెట్‌ ఎంసీ నికల్సన్‌ రోడ్డులోని ఓ భవనంలో అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న జొమాటో బ్యాగులను గుర్తించిన అధికారులు ఆ సంస్థకు లక్ష రూపాయల జరిమానా విధించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad