సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

21-10-2019 Mon 07:21
  • చైతూతో జతకట్టనున్న రష్మిక 
  • విజయ్ దేవరకొండ 'హీరో' అప్ డేట్ 
  • ఏడు భాషల్లో వస్తున్న ఉపేంద్ర సినిమా

*  ప్రస్తుతం మహేశ్ బాబు, నితిన్, అల్లు అర్జున్ సినిమాలతో తెలుగులో బిజీగా వున్న కథానాయిక రష్మిక త్వరలో నాగ చైతన్య సరసన నటించనుంది. చైతూ హీరోగా నూతన దర్శకుడు శశి ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇందులో కథానాయిక పాత్రకు రష్మికను తీసుకుంటున్నట్టు సమాచారం.
 *  విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా 'హీరో' తాజా షెడ్యూల్ షూటింగ్ వచ్చే నెల మొదటి వారం నుంచి జరుగుతుంది. ఈ సినిమాలో విజయ్ బైక్ రేసర్ గా నటిస్తున్నాడు. దీంతో ఈ విషయంలో నిపుణుల వద్ద శిక్షణ కూడా తీసుకున్నాడు. 50 కోట్ల బడ్జెట్టుతో ఇది నిర్మాణం జరుపుకుంటోంది.
 *  తెలుగు వారికి కూడా సుపరిచితుడైన ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ప్రస్తుతం 'కబ్జా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు ఆర్.చంద్రు దర్శకత్వంలో 40 కోట్ల బడ్జెట్టుతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు సహా మొత్తం ఏడు భాషల్లోకి అనువదిస్తుండడం విశేషం!