నాడు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్..ఇప్పుడు జగన్: ఉండవల్లి అరుణ్ కుమార్

20-10-2019 Sun 21:07
  • మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 51 శాతం ఓట్లు వచ్చాయి
  • గతంలో పీవీకి, ఎన్టీఆర్ కే ఇంత ఓటింగ్ వచ్చింది
  • జగన్ పై ప్రజల్లో బాగా ‘ఎక్స్ పెక్టేషన్స్’ ఉన్నాయి

మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయని, ఇది చిన్న విషయం కాదని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ‘టీవీ 9’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నాడు పీవీ నరసింహారావుకు, ఎన్టీ రామారావుకు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికే ఇంత శాతం ఓటింగ్ వచ్చిందని అన్నారు. కేంద్రంలో అయితే ఎప్పుడూ ఇంత శాతం ఓటింగ్ రాలేదు, జవహర్ లాల్ నెహ్రూ హయాం సహా అని చెప్పారు.

నాడు రాజీవ్ గాంధీకి నాలుగు వందల సీట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఇంత శాతం ఓట్లు రాలేదని గుర్తుచేశారు. యాభై ఒక్క శాతం ఓట్లతో గెలిచిన జగన్ పై ప్రజల్లో బాగా ‘ఎక్స్ పెక్టేషన్స్’ ఉన్నాయని అన్నారు. ఎప్పుడైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతామో, అప్పుడు ప్రజల్లో నమ్మకం పోతుందని అన్నారు.