Kachhuluru: కచ్చులూరు ప్రమాద ఘటన.. రేపు సాయంత్రానికి బోటు బయటకు తీసే అవకాశాలు!

  • నది అడుగుభాగంలోకి వెళ్లిన డీప్ సీ డైవర్స్
  • మునిగిపోయిన బోటును గుర్తింపు
  • నలభై అడుగుల లోతులో ఉన్న బోటు 

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును రేపు సాయంత్రానికి బయటకు తీసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాయల్ వశిష్ట-2 ఐదో రోజు ఆపరేషన్ లో భాగంగా ఈరోజు పనులు ముగిశాయి. విశాఖపట్టణం నుంచి పది మంది డీప్ సీ డైవర్స్ ను ధర్మాడి సత్యం బృందం తీసుకొచ్చింది. ఇద్దరు డీప్ సీ డైవర్స్ నది అడుగుభాగంలోకి వెళ్లారు. పైపుల ద్వారా వారికి ఆక్సిజన్ అందించారు. నదిలో మునిగిపోయిన బోటును గుర్తించారు.

బోటు నీటిపై వెళ్లేప్పుడు ఎలా ఉంటుందో, మునిగినిపోయిన బోటుకూడా అలాగే ఉందని డీప్ సీ డైవర్స్ చెప్పారు. సాధారణంగా బోటు బరువు నలభై టన్నులు ఉంటుందని, మునిగిపోయిన బోటులో బాగా ఒండ్రు మట్టి చేరడంతో దాని బరువు మరింత ఉండొచ్చని చెప్పారు. నలభై అడుగుల లోతులో బోటు ఉందని, దానిని బయటకు తీయాలంటే ఎక్కడ తాళ్లు కట్టాలో చర్చలు జరిపారు.  

More Telugu News