ఆర్టీసీ ఆస్తులను కాపాడాలి: ప్రొఫెసర్ కోదండరామ్

20-10-2019 Sun 16:53
  • హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలి
  • కార్మికులను చర్చలకు పిలవాలి
  • ఆర్టీసీ జేఏసీ అన్ని కార్యక్రమాలకు మా మద్దతు ఉంటుంది

హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం గౌరవించి ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మరోమారు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ ఆస్తులను కాపాడాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ తీసుకున్న అన్ని కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ఆర్టీసీ జేఏసీకి మద్దతుగా లెఫ్ట్ పార్టీలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటాయని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కార్మికులతో చర్చలు జరపాలన్న హైకోర్టు సూచనలను పట్టించుకోవడం లేదని తమ్మినేని విమర్శించారు. ఆర్టీసీ జేఏసీ న్యాయబద్ధంగా ముందుకెళ్తోంది అని, 21న వామపక్షాల కుటుంబాలతో కలిసి జేఏసీ వాళ్లతో ఆర్టీసీ డిపోల వద్ద బైఠాయింపు జరుపుతామని అన్నారు.