పంచెకట్టులో మెరిసిన రాజమౌళి... వెంట ప్రభాస్, రానా, అనుష్క!

20-10-2019 Sun 12:41
  • లండన్ థియేటర్ లో 'బాహుబలి: ది బిగినింగ్'
  • సినిమాను వీక్షించిన 5 వేల మందికి పైగా ప్రేక్షకులు
  • తరలివచ్చిన చిత్ర యూనిట్

'బాహుబలి' వంటి చిత్ర రాజాన్ని సినీ పరిశ్రమకు అందించిన దర్శక ధీరుడు, లండన్ లో పంచెకట్టులో మెరిశారు. ఇక్కడి ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రేక్షకుల ముందు 'బాహుబలి: ది బిగినింగ్', సంగీత దర్శకుడు కీరవాణి ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్ర నటీ నటులు ప్రభాస్, రానా, అనుష్కలతో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ కూడా హాజరయ్యారు. అక్కడ వీరు దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ సినిమాను చూడాలని జపాన్ నుంచి లండన్ వరకూ కొంతమంది అమ్మాయిలు రావడం గమనార్హం. వారంతా రాజమౌళితో ఫోటోలు దిగడానికి ఆసక్తిని చూపారు.