Call Girl: 'కాల్ గర్ల్' అని తిట్టినందుకు యువతి ఆత్మహత్య... పదిహేనేళ్ల తరువాత కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు!

  • సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన కేసు
  • విచారించిన జస్టిస్ ఇందు మల్ హోత్రా, సుభాష్ రెడ్డిల ధర్మాసనం
  • నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు

'నువ్వో కాల్ గర్ల్' అన్న మాటలతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా, ఆ కేసు పదిహేనేళ్ల పాటు ఓ కుటుంబాన్ని కోర్టు చుట్టూ తిప్పింది. చివరకు కేసును కొట్టేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడు ఓ ఉపాధ్యాయుడు కాగా, అతని తల్లిదండ్రులపైనా అభియోగాలు నమోదయ్యాయి. కేసును విచారించిన జస్టిస్ ఇందు మల్ హోత్రా, ఆర్ సుభాష్ రెడ్డిల ధర్మాసనం, కేవలం 'కాల్ గర్ల్' అని వ్యాఖ్యానించడమే వారిని ప్రాసిక్యూట్ చేసేందుకు సరిపోదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

కోపంలో ఆ మాటను వాడివుండవచ్చని, దాని వెనుక దురుద్దేశాలు ఉంటాయని భావించడం లేదని పేర్కొంది. గతంలో ఇదే తరహాలో ఓ కేసు వచ్చిందని, 'వెళ్లి చావు' అని భర్త తిట్టాడన్న మనస్తాపంతో భార్య ఆత్మహత్య చేసుకుందని, అప్పుడు కూడా ఇదే తరహా తీర్పు ఇచ్చామని న్యాయమూర్తులు గుర్తు చేశారు. తాజా కేసులో ఐపీసీలోని 306/34 సెక్షన్ నిందితులకు వర్తించదని స్పష్టం చేసింది.

More Telugu News