రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడానికి అందరూ కలిసి రావాలి: లక్ష్మణ్

20-10-2019 Sun 11:01
  • ఆర్టీసీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
  • రాష్ట్ర ప్రభుత్వ తీరును కేంద్ర సర్కారు గమనిస్తోంది
  • రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెను ఉద్ధృతం చేస్తాం

తెలంగాణ సర్కారు మెడలు వంచడానికి మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆర్టీసీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన సమక్షంలో ఈ రోజు ఉదయం పలువురు రాష్ట్ర నేతలు బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరును కేంద్ర సర్కారు గమనిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. కాగా, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 16వ రోజుకి చేరింది. కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ కోరింది. ఆర్టీసీ పరిరక్షణకే తాము సమ్మె చేస్తున్నామని తెలిపింది.