Telangana: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

  • అకస్మాత్తుగా ఏర్పడే క్యుములో నింబస్ మేఘాలు
  • నేడు, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షం
  • హెచ్చరించిన వాతావరణ శాఖ అధికారులు

అంతవరకూ కనిపించిన ఎండ, క్యుములో నింబస్ మేఘాల కారణంగా ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురుస్తుందని, తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఈశాన్య రుతుపవనాల కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న గాలులతో క్షణాల్లో కుంభవృష్టి కురిపించే క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. దీని కారణంతో పలు ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

కాగా, గడచిన 24 గంటల వ్యవధిలో వరంగల్ జిల్లాలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 1 వరకూ తెలంగాణలో 66.4 ఎంఎం సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి వుండగా, ఇప్పటికే 89.4 ఎంఎం వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోనూ సాధారణ స్థాయి కన్నా అధిక వర్షపాతం నమోదైందని అన్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. 

More Telugu News