Karnataka: పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తలలకు అట్టపెట్టెలు.. విస్మయం కలిగిస్తోన్న ఇన్విజిలేటర్ల తీరు

  • కర్ణాటకలోని హావేరిలోని భగత్ ప్రీ విశ్వవిద్యాలయ కాలేజీలో ఘటన
  • చూసిరాతలకు పాల్పడకుండా వింత ప్రయోగం
  • వివరణ కోరిన విద్యా శాఖ

పరీక్ష రాస్తోన్న విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా చూసిరాతలకు పాల్పడకుండా వారిని తనిఖీ చేసి పరీక్ష హాల్ లోకి పంపే విధానాన్ని మనం ఇంతవరకు చూశాం. అలాగే, పరీక్ష హాల్లోనూ ఇన్విజిలేటర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. విద్యార్థులను పక్కకు చూడొద్దని, ఇతరులతో మాట్లాడవద్దని చెబుతుంటారు. అయినప్పటికీ కొందరు విద్యార్థులు వాటిని పట్టించుకోరు. విద్యార్థులు ఎంతగా చెప్పినా వినట్లేదని అనుకున్నారో ఏమో ఓ కళాశాలలో ఇన్విజిలేటర్లు విచిత్ర తీరుతో వ్యవహరించారు.

పరీక్ష రాస్తోన్న విద్యార్థులు తోటివారి పేపర్లలో చూసి రాయకుండా ఉండేందుకు కర్ణాటకలోని హావేరిలోని భగత్ ప్రీ విశ్వవిద్యాలయ ఇన్విజిలేటర్లు చేసిన ఆ ప్రయోగం విస్మయం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కళాశాల విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో తమ తలలు పక్కకు తిప్పకుండా ఉండేందుకు వారి తలలకు అట్టపెట్టెలు పెట్టారు. ఈ విషయం కర్ణాటక విద్యా శాఖ దృష్టికి వెళ్లడంతో దీనిపై వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

More Telugu News