సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడాలి: మోత్కుపల్లి నర్పింహులు

19-10-2019 Sat 10:33
  • కార్మికుల బంద్ కు మద్దతిచ్చిన మోత్కుపల్లి అరెస్ట్
  • హైకోర్టు సూచించినా కేసీఆర్ పట్టించుకోవట్లేదు
  • ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయంలో సీఎం కేసీఆర్ తన మొండి వైఖరి వీడాలని మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్పింహులు అన్నారు. కార్మికులకు మద్దతుగా సికింద్రాబాద్ లోని జేబీఎస్ బస్టాండ్ వద్ద ఆయన తన నిరసన తెలిపారు. మోత్కుపల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు సూచించినప్పటికీ కేసీఆర్ నోరు మెదపడం లేదని, ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.