క్రిష్ నిర్మాణంలో హీరోగా అవసరాల

19-10-2019 Sat 09:40
  • దర్శకుడిగా క్రిష్ కి మంచి పేరు 
  • నిర్మాతగా 'అంతరిక్షం'తో నష్టాలు 
  • దిల్ రాజుతో కలిసి మరో సినిమా నిర్మాణం 

ఒక వైపున పెద్ద సినిమాలకి దర్శకత్వం వహిస్తూనే, మరో వైపున చిన్న సినిమాలను నిర్మించాలని కొంతకాలం క్రితమే దర్శకుడు క్రిష్ నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడైన రాజీవ్ రెడ్డిని నిర్మాణ భాగస్వామిగా చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి వరుస సినిమాలు నిర్మించాలని అనుకున్నారు.

అయితే సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేసిన 'అంతరిక్షం' ఆర్ధికంగా దెబ్బకొట్టేసింది. దాంతో కొంతకాలం పాటు కొత్త సినిమా నిర్మాణపు పనులను ఆపేశారు. తాజాగా మరో సినిమాను నిర్మించడానికి ఈ ఇద్దరూ రంగంలోకి దిగారు. దిల్ రాజును కూడా భాగస్వామిగా చేసుకుని ఒక సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా సంపూర్ణేష్ బాబును హీరోగా తీసుకోవాలనుకున్నారు. ఆ తరువాత మనసు మార్చుకుని అవసరాల శ్రీనివాస్ ను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. ఇక దర్శకుడు ఎవరనేది త్వరలో తెలియనుంది.