Balakrishna: సంక్రాంతి బరిలో బాలయ్య మూవీ లేనట్టే!

  • యాక్షన్ ఎంటర్టైనర్ గా బాలకృష్ణ మూవీ 
  • కథానాయికలుగా సోనాల్ - వేదిక 
  • డిసెంబర్ 3వ వారంలో విడుదల  

బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ .. వేదిక నటిస్తున్నారు. డిఫరెంట్ గెటప్ లో బాలకృష్ణ ఈ సినిమాలో కనిపించనున్నారు. మొదటి నుంచి బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. సంక్రాంతికి తన సినిమా తప్పకుండా బరిలో ఉండాలని ఆయన భావిస్తారు.

అందువలన ఈసారి కూడా సంక్రాంతికి ఆయన సినిమా ఉంటుందని అభిమానులు ఆశించారు. అయితే ఈ సంక్రాంతికి గట్టిపోటీ వుంది. మహేశ్ బాబు 'సరిలేరు నీ కెవ్వరు' .. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సంక్రాంతికి బరిలోకి దిగనున్నాయి. ఇక రజనీ 'దర్బార్' కూడా రంగంలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3వ వారంలో ప్రేక్షకుల ముందుకు వెళ్లాలని బాలకృష్ణ భావించినట్టుగా సమాచారం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News