వైసీపీలోకి పురందేశ్వరి వస్తే గౌరవిస్తాం: బాలినేని శ్రీనివాస్ రెడ్డి

18-10-2019 Fri 22:08
  • దగ్గుబాటి దంపతులు చెరో పార్టీలో ఉండడం తగదు
  • వైసీపీలోకి పురందేశ్వరి వస్తే సముచిత స్థానం ఇస్తాం
  • ఈ మేరకు సీఎం జగన్ అభిప్రాయపడ్డారన్న బాలినేని

దగ్గుబాటి దంపతులు చెరో పార్టీలో ఉండడం భావ్యం కాదని సీఎం జగన్ అభిప్రాయపడినట్టు ఏపీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురందేశ్వరి ఒకే పార్టీలో ఉండాలని,   వైసీపీలోకి వస్తే ఆమెను సాదరంగా ఆహ్వానిస్తామని, సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని జగన్ అభిప్రాయపడ్డారని బాలినేని పేర్కొన్నారు.

కాగా, ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరుచూరు వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఆ పదవి నుంచి దగ్గుబాటిని తప్పిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన అనుచరులు ఈరోజు బాలినేనిని కలిశారు. నియోజకవర్గం ఇన్ చార్జ్ గా దగ్గుబాటినే కొనసాగించాలని కోరారు.