Chidambaram: చిదంబరం ఆరోగ్యం క్షీణిస్తోందంటున్న కపిల్ సిబాల్

  •  బెయిల్ మంజూరు చేయాలన్న న్యాయవాది
  • సుప్రీంకోర్టుకు  కపిల్ సిబాల్ అభ్యర్థన
  • తీర్పును రిజర్వ్ లో పెట్టిన కోర్టు

కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆరోగ్యం సన్నగిల్లుతోందని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబాల్ అన్నారు. చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సిబల్ కోర్టుకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన 4 కిలోల బరువు తగ్గారని, జైలు పరిస్థితులు ఆయనకు అనుకూలించడం లేదని, శీతాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం మరింత దిగజారుతుందని కోర్టుకు తెలిపారు. మానవతా దృక్పథంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని సిబాల్ కోరారు. విడుదల తర్వాత చిదంబరం సాక్షులను ప్రభావితం చేయరని కోర్టుకు తెలిపారు. దీనిపై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ లో పెట్టింది.

 ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో తీహార్‌ జైలులో వున్న కేంద్ర మాజీ మంత్రి విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు తాజాగా సీబీఐ ఈ కేసులో చిదంబరంతో పాటు 13 మందిని నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

More Telugu News