ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం 40 కోట్ల ఖర్చు

18-10-2019 Fri 16:51
  • షూటింగు దశలో 'ఇండియన్ 2'
  • భోపాల్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరణ 
  • వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల 

కమల్ కథానాయకుడిగా గతంలో శంకర్ తెరకెక్కించిన 'ఇండియన్' సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకి శంకర్ సీక్వెల్ చేస్తున్నాడు. కమల్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా కాజల్ కనిపించనుంది. ఇప్పటికే కొంత చిత్రీకరణ జరుపుకుంది.

తాజా షెడ్యూల్ షూటింగ్ భోపాల్ లో జరుగుతోంది. అక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. పీటర్ హెయిన్స్ డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణకు 40 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారట. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ యాక్షన్ ఎపిసోడ్ నిలిచిపోతుందని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ .. రకుల్ .. ఐశ్వర్య రాజేశ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.