Alla Ramakrishna Reddy: రాజధానిలో బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ సీఎం జగన్ కు లేఖ రాసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

  • అన్యాయంగా భూములు తీసుకున్నారంటూ ఆరోపణలు
  • అంగీకరించని రైతులపై కేసులు పెట్టారని వెల్లడి
  • పంటలు తగులబెట్టించారంటూ వ్యాఖ్యలు

రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గత ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ జరిపిందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏటా ఐదు పంటల వరకు పండే భూములను అన్యాయంగా లాగేసుకున్నారని, భూములు ఇచ్చేందుకు అంగీకరించని రైతులపై కేసులు పెట్టి, వాళ్ల పంటలు తగులబెట్టించారని విమర్శించారు.

గత ప్రభుత్వం రాజధానిలో అమలు చేసిన బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆయన సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరైన నిర్ణయం కాదని శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పిందని, అయినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబునాయుడు బలవంతపు భూసేకరణ చట్టం చేశారని ఆర్కే తన లేఖలో పేర్కొన్నారు.

More Telugu News