మార్కెట్లలో కొనసాగుతున్న జోరు.. నేడు కూడా లాభాలే

18-10-2019 Fri 15:44
  • 246 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 74 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 8 శాతానికి పైగా పుంజుకున్న యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్లు పెరిగి 39,298కి చేరుకుంది. నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 11,660 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (8.65%), మారుతి సుజుకీ (2.80%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.33%), ఎన్టీపీసీ (2.32%), ఎల్ అండ్ టీ (1.81%).

టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-1.19%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.78%), బజాజ్ ఆటో (-0.65%), భారతి ఎయిర్ టెల్ (-0.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.21%).