ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి?: చంద్రబాబు

18-10-2019 Fri 09:51
  • ఏపీలో ఏబీఎన్ ప్రసారాల నిలిపివేత
  • కోర్టులో ఒకలా, పాలనలో మరోలా ఉన్న ప్రభుత్వం
  • ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబునాయుడు

ఆంధ్రప్రదేశ్ లో ఏబీఎన్ ప్రసారాల నిలుపుదలను ఖండిస్తూ, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఈ ఉదయం తన సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కారు అబద్ధాలు చెబుతోందని, ఆ అవసరం ఏముందని ప్రశ్నించారు. "ఏబీఎన్ ప్రసారాల నిలుపుదలపై టీడీశాట్ విచారణలో సాంకేతిక కారణాలంటూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? కోర్టుల ముందు ఒకలా, పాలనలో మరోలా ప్రభుత్వం ఎందుకుంటోంది? అప్పీలేట్ ట్రిబ్యునల్స్, ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలేస్తున్నా వైసీపీ నేతల్లో మార్పు రాదా? ఇప్పటికైనా ప్రభుత్వ ధోరణి మారాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.