Chennai: నాలుగు దశాబ్దాల తర్వాత పునఃప్రారంభమైన జాఫ్నా-చెన్నై విమాన సర్వీసులు

  • ఎల్టీటీఈ-శ్రీలంక మధ్య పోరు నేపథ్యంలో నిలిచిపోయిన సేవలు
  • భారత ఆర్థిక సాయంతో జాఫ్నాలో అంతర్జాతీయ విమానాశ్రయం
  • ప్రారంభించిన అధ్యక్షుడు సిరిసేన

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) పోరాటం నేపథ్యంలో 40 ఏళ్ల క్రితం శ్రీలంకలోని జాఫ్నా-చెన్నై మధ్య నిలిచిపోయిన విమాన సర్వీసులు తాజాగా మళ్లీ ప్రారంభమయ్యాయి. భారత్ అందించిన ఆర్థిక సాయంతో శ్రీలంక ప్రభుత్వం జాఫ్నాలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించింది. దీనిని ప్రారంభించిన ఆ దేశాధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన.. జాఫ్నా-చెన్నై మధ్య విమాన సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విమాన సర్వీసు ఇరు దేశాల మధ్య ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సరికొత్త విమాన సర్వీసుతో ఇరు దేశాల బంధం మరింత దృఢపడుతుందని శ్రీలంకలో భారత రాయబారి తరన్‌జిత్ సింగ్ సంధూ పేర్కొన్నారు.

More Telugu News