India: మెక్సికో మీదుగా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించబోయిన భారతీయుల ప్రయత్నం విఫలం

  • 311 మంది భారతీయులు వెనక్కి
  • వీరిలో ఒక మహిళతో పాటు 310 మంది పురుషులు
  • మెక్సికో నుంచి బయలు దేరిన ప్రైవేటు విమానాన్ని వెనక్కి పంపించిన అధికారులు

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాలన్న 311 మంది భారతీయుల ప్రయత్నం బెడిసి కొట్టింది. వీరు ప్రయాణిస్తున్న ప్రైవేటు విమానాన్ని మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి  వెనక్కి మళ్లించారు. ఈ మేరకు వివరాలను ఓ సీనియర్ ఇమ్మిగ్రేషన్ అధికారి మీడియాకు వెల్లడించారు.

‘కొంతమంది ఇంటర్నేషనల్ ఏజెంట్ల ద్వారా అమెరికాలో ప్రవేశించడానికి వీరు మెక్సికో దేశానికి చేరుకున్నారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తి రూ.25 నుంచి 30 లక్షల వరకు సదరు ఏజెంట్లకు సమర్పించుకున్నారు. వీరందరిని మెక్సికోకు ఒక విమానం ద్వారా తీసుకువచ్చారు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నెల రోజుల్లోపు వారిని అమెరికాకు చేర్చాలి. అప్పటి వరకు వారందరికీ మెక్సికోలో ఉండటానికి వసతి తదితర సౌకర్యాలను ఆ ఏజెంట్లు కల్పించారు. వీరిలో 310 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. 60 మందితో కూడిన ఒక ఎస్కార్టు విమానంలో  వీరందరిని మరో ప్రైవేటు విమానంలో అమెరికాకు పంపుతుండగా మెక్సికో ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి వారి ప్రయాణాన్ని నిలిపివేశారు’ అని వెల్లడించారు.

More Telugu News