Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 453 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 118 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 15 శాతానికి పైగా పుంజుకున్న యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ సూచీలు మినహా మిగిలిన సూచీలన్నీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 453 పాయింట్లు పెరిగి 39,052కి ఎగబాకింది. నిఫ్టీ 118 పాయింట్లు లాభపడి 11,582కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (15.13%), టాటా మోటార్స్ (13.35%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.18%), టాటా స్టీల్ (3.61%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.58%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.04%), వేదాంత లిమిటెడ్ (-0.80%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.63%), ఓఎన్జీసీ (-0.42%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.31%).

More Telugu News