Jagan: ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే వారి మీద కేసులు పెడతారా? సిగ్గుగా లేదా?: నారా లోకేశ్

  • జగన్ పై లోకేశ్ విమర్శలు
  • నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి ఉద్ధరించేస్తానన్నారు
  • అనంతపురంలో ధర్నా చేసిన 22 మంది నిరుద్యోగులపై అక్రమ కేసులు పెట్టారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ, ఆ రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను జగన్ అమలు చేయట్లేదని అన్నారు. 'పాదయాత్రలో కోటి 70 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి యువతను ఉద్ధరించేస్తానన్న మీరు.. ఇప్పుడు వాళ్ల మీద క్రిమినల్ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారా? ఉద్యోగాల కోసం అనంతపురంలో ధర్నా చేసిన 22 మంది నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలి' అని ట్వీట్ చేశారు.
 
'నిరుద్యోగులపై అంత కక్ష ఎందుకు జగన్ గారు? ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే వాళ్ల మీద కేసులు పెడతారా? సిగ్గుగా లేదా? గ్రామ వాలంటీర్ పేరుతో మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. సచివాలయ పరీక్షా పత్రాలు లీక్ చేసి 20 లక్షల మంది నిరుద్యోగులను నట్టేట ముంచారు' అని లోకేశ్ విమర్శలు గుప్పించారు. జగన్ ఓ విఫలమైన ముఖ్యమంత్రి అంటూ ఆయన హ్యాష్ ట్యాగ్ జోడించారు.

More Telugu News