lunar: రెండింటి మట్టి సేమ్ టు సేమ్.. జాబిల్లి, అంగారకుడిపై పంటలు పండించుకోవచ్చట!

  • పంటలు పండించుకునేందుకు అనువుగా మట్టి
  • ప్రయోగాత్మకంగా పండించిన శాస్త్రవేత్తలు
  • టమాటా, ముల్లంగి, మెంతికూర, బఠానీ పంటలు పండించిన వైనం

చందమామ, అంగారకుడిపై మానవ నివాసానికి ఉన్న అవకాశాలపై ప్రస్తుతం విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మానవులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోగలిగితే వారికి ఆహారం ఎలా అన్న సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. ఆ రెండు గ్రహాలపై ఉన్న మట్టి ఇంచుమించు ఒకేలా ఉందని, కొన్ని రకాల పంటలను అక్కడ పండించుకోవచ్చని నెదర్లాండ్స్‌లోని వేజ్‌నింజన్ రీసెర్చ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇటీవల వారు అచ్చం ఆయా గ్రహాల్లో ఉన్న మట్టిని పోలినట్టుగా ఉండే మట్టిపై వివిధ పంటలను ప్రయోగాత్మకంగా పండించి విజయం సాధించారు. వారు సాగు చేసిన వాటిలో టమాటా, ముల్లంగి, మెంతికూర, బఠానీ వంటి పంటలు ఏపుగా పెరగ్గా, పాలకూర మాత్రం అనుకున్న స్థాయిలో పెరగలేదు. వీటి ద్వారా లభ్యమైన విత్తనాలు తిరిగి సాగుకు పనికివచ్చేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

More Telugu News