Telangana: బాప్‌రే! ఏమిటీ స్పందన.. తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు పోటెత్తిన వ్యాపారులు!

  • నిన్న సాయంత్రంతో ముగిసిన గడువు
  • రాత్రి 11:30 గంటల వరకు కొనసాగిన దరఖాస్తుల స్వీకరణ
  • ఒక్క దరఖాస్తుల ద్వారానే రూ. 907 కోట్ల ఆదాయం

తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు అనూహ్య స్పందన వస్తోంది. దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఆన్‌లైన్‌తోపాటు నేరుగానూ దరఖాస్తుల దాఖలుకు అధికారులు అనుమతి ఇచ్చారు. నిన్న సాయంత్రంతో దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే, క్యూలో నిల్చున్న వారికి కూడా దాఖలుకు అనుమతి ఇవ్వడంతో దరఖాస్తుల సమర్పణ పూర్తయ్యేసరికి రాత్రి 11:30 గంటలు దాటింది. మొత్తంగా 48,385 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు.

ప్రతి దరఖాస్తుదారు టెండర్ ఫీజు కింద 2 లక్షలు చెల్లించాలి. టెండర్ దక్కకపోతే ఆ రెండు లక్షలు పోయినట్టే. అంటే ఒకవిధంగా ఇది లాటరీ లాంటిదన్న మాట. పొతే రెండు లక్షలు.. దుకాణం వస్తే డబ్బుల పంట! అందుకే ఎగబడి మరీ దరఖాస్తులు చేశారు. ఈ లెక్కన ఒక్క దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి ఏకంగా రూ.907 కోట్ల ఆదాయం లభించనుంది. గతేడాదితో పోలిస్తే రెండింతలకు పైనే. గతేడాది ఇది కేవలం రూ.400 కోట్లే. కాగా, దుకాణాలను దక్కించుకున్న వారు మద్యాన్ని నిర్ణీత ధరకు మించి అమ్మితే చర్యలు తీసుకుంటామని ఆబ్కారీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

More Telugu News