Telangana: ఆర్టీసీ కార్మికులకు శుభవార్త.. అందనున్న గతనెల వేతనాలు

  • వేతనాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
  • అంగీకరించిన ఆర్టీసీ యాజమాన్యం
  • కార్మికులకు, ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు

సమ్మెకు దిగిన కార్మికులకు గతనెల వేతనాలు చెల్లిస్తామని హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అయితే, సమ్మె నేపథ్యంలో వేతనాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని తెలిపింది. దీంతో సోమవారం లోపు వారికి వేతనాలు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలివ్వాలంటూ  హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకే ఈ ఆదేశాలు ఇచ్చింది.

అలాగే,  ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. కార్మికులతో సర్కారు చర్చలు జరపాలని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గి, సమ్మె విరమించాలని సూచించింది. కాగా, చర్చల కోసం ప్రభుత్వం నుంచి పిలుపురాకపోవడంతో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ యోచిస్తోంది.

More Telugu News