Chandrababu: ప్రాంతీయ పార్టీల నాయకులు చచ్చేంత వరకూ సీఎంలుగా ఉండాలనుకుంటారు!: జేసీ దివాకర్ రెడ్డి

  • చంద్రబాబు ఎన్నో స్కీమ్స్ పెట్టాడు. ఎందుకు చేశాడు?
  • సీఎం కావాలనేగా.. పార్టీ పదేళ్ల పాటు ఉండాలనేగా?
  • పనికొచ్చే కార్యక్రమాలు చాలా తక్కువ చేసేవి ప్రాంతీయ పార్టీలే

ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ మారిపోవడానికి కారణం ప్రాంతీయపార్టీలు అని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత దరిద్రమైన పరిస్థితి రావడానికి కారణం ప్రాంతీయ పార్టీలే అని తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి ప్రాంతీయ పార్టీలను పెంచి పెద్ద చేసింది ‘మన తమిళనాడు ఎంజీఆర్ గారు అనుకుంటా’ అని అన్నారు. ఈ సందర్భంగా తన పార్టీ టీడీపీపైనా ఆయన విమర్శలు గుప్పించారు.

‘చంద్రబాబునాయుడు బహుశ నూరో, నూట ఇరవయ్యో స్కీమ్స్ పెట్టాడు. ఎందుకు చేశాడు ఆయన? ‘ఇది మంచి గవర్నమెంట్, ఆయన మంచాయన’ అని పించుకుని ముఖ్యమంత్రి కావాలని, ఆ పార్టీ పదేళ్ల పాటు ఉండాలని. ‘నవరత్నాలు’ అని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏందది? ‘చాలా మంచివాడు, ప్రజలకు ఉపయోగపడుతున్నాడు’ అని అనిపించుకుని మళ్లీ ఐదేళ్లు గవర్నమెంట్ లోకి రావాలనే కదా’ అని అన్నారు.

సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు చాలా తక్కువ చేసేవి ప్రాంతీయ పార్టీలే అంటూనే.. ఏ ఒక్క పార్టీని తాను విమర్శించడం లేదని జేసీ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రాంతీయ పార్టీల నాయకులందరూ కూడా వాళ్లు చచ్చేంత వరకూ ముఖ్యమంత్రులుగా ఉండాలని, వాళ్ల తర్వాత వాళ్ల సంతతి రావాలన్నది వాళ్ల ధ్యేయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

More Telugu News