polavaram: ‘రివర్స్’తో డబ్బులు మిగిలితే మిగలొచ్చు కానీ, చేసిన పని ఎలాంటిదో ఆలోచించుకోవాలి?: జేసీ దివాకర్ రెడ్డి

  • గత కాంట్రాక్టర్లు డబ్బులు తింటే తినొచ్చు
  • ‘పోలవరం’ పనులు ఆపడం కరెక్టు కాదు
  • పొత్తుకు ద్వారాలు మూయడానికి, తెరవడానికి కన్నా ఎవరు?

పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి రివర్స్ టెండర్లతో ప్రభుత్వానికి డబ్బులు మిగిలితే సంతోషమే కానీ, చేసిన పని ఎలాంటిదో ఆలోచించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సూచించారు. గత కాంట్రాక్టర్లు డబ్బులు తిని ఉంటే ఉండొచ్చు కానీ, పోలవరం ప్రాజెక్టు పనులు ఆపివేయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.

ఏపీలో మార్పును కోరుకున్న ప్రజలు జగన్ ని గెలిపించారని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో ముక్కూ మొహం తెలియని వైసీపీ అభ్యర్థులకూ ఓట్ల మెజార్టీ వేలల్లో వచ్చిందని, దానికి కారణం మోదీ మంత్ర దండమేనని వ్యాఖ్యానించారు. జగన్ కు మంచీచెడూ చెప్పేవారు లేరని, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటారని విమర్శించారు. జగన్ మంచీ చెడూ రెండూ చేస్తున్నారన్న జేసీ, జగన్ పాలన గురించి చెప్పాలంటే మరో ఆరు నెలలు గడవాలని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ఆయన విమర్శలు చేశారు. పొత్తుకు ద్వారాలు మూయడానికి, తెరవడానికి కన్నా ఎవరు? అని ప్రశ్నించారు.

More Telugu News